News June 3, 2024
RTV సర్వే.. జగన్ను దెబ్బకొట్టేవి ఇవే!

RTV సర్వేలో ఎన్డీయే కూటమికి 120 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీ ఓటమికి పలు కారణాలను అంచనా వేసింది.
1.చంద్రబాబు అరెస్టుతో టీడీపీ క్యాడర్ కసిగా పనిచేయడం.
2.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్లిపోతాయన్న భయం
3.మద్యంలో చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు
4.రోడ్లు దారుణంగా ఉండటం
5.60 గజాల ఇళ్లస్థలాలే ఇవ్వడం, అదీ ఊరుకు దూరంగా, మునిగిపోయే చోట ఇచ్చారని మహిళల్లో అసంతృప్తి
Similar News
News January 1, 2026
అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్కు చెందిన షౌకత్ కరెంట్ షాక్తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 1, 2026
జనవరి 1: చరిత్రలో ఈరోజు

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం


