News October 27, 2024

RU వర్సిటీ ఫలితాలు విడుదల

image

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్‌టీకే నాయక్ తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను యూనివర్సిటీ <>వెబ్‌సైట్‌లో <<>>చూడాలన్నారు. రెండో సెమిస్టర్‌లో 1,068 మందికి 214, 4వ సెమిస్టర్‌లో 1,866 మందికి గానూ 460 మంది పాసయ్యారని చెప్పారు.

Similar News

News November 14, 2024

ఆదోని: పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు

image

ఆదోని పట్టణంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా పత్తికొండలో టీడీపీ నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 14, 2024

పోసానిపై చర్యలు తీసుకోండి.. బనగానపల్లిలో ఫిర్యాదు

image

నటుడు పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లి జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐ ప్రవీణ్ కుమార్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, జవహర్, వెంకట రాముడు, శేఖర్, ఓబులేసు, నాగేశ్, సుధాకర్ పాల్గొన్నారు.

News November 14, 2024

వెలుగోడులో యువతి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.