News February 25, 2025
ప్రత్యేక హోదా అంశంపై మండలిలో రభస

AP: రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై మండలిలో రభస జరిగింది. ‘హోదా ఎందుకు తేవట్లేదు?’ అని YCP సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది.? ఏడాదిలో రూ.13వేల కోట్లు తెచ్చాం. YCP 5ఏళ్లలో ఏం సాధించింది’ అని లోకేశ్ ప్రశ్నించారు.
Similar News
News February 25, 2025
మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్‌గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్‌గా నిలుస్తారేమో చూడాలి.
News February 25, 2025
ఈ అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి: వైద్యులు

షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌తో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ తినొద్దు’ అని చెప్పారు.
News February 25, 2025
రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.