News October 3, 2025
‘రాణీ కనకవతి’గా కట్టిపడేసిన రుక్మిణీ

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ నిన్న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రాణీ కనకవతిగా రుక్మిణీ వసంత్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఆమె పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్, అందం, అభినయానికి ఫిదా అవుతున్నారు. కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌కు రుక్మిణీ న్యాయం చేశారు. SMలో ఆమె పేరు మారుమోగిపోతోంది. మూవీ చూసినవారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
ఇండియాతో ట్రేడ్ డీల్ చరిత్రాత్మకం: ట్రంప్

ఇండియాతో తాము చేసుకున్న <<19073011>>ట్రేడ్ డీల్<<>> చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘మా నాయకత్వంలో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుగా US మారుతోంది. కొన్ని నెలల్లోనే జపాన్, కొరియా, ఇండియా తదితర దేశాలతో డీల్స్ కుదుర్చుకున్నాం. ఈ దేశాలకు కోల్ ఎగుమతులను భారీగా పెంచుతాం’ అని చెప్పారు. తమ బొగ్గు నాణ్యత ప్రపంచంలోకెళ్లా అత్యుత్తమమని ‘ఛాంపియన్ ఆఫ్ కోల్’ కార్యక్రమంలో తెలిపారు.
News February 12, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,200 తగ్గి రూ.1,58,400కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 తగ్గి రూ.1,45,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 12, 2026
US, వెనిజులా ఆయిల్ కొనుగోళ్లు పెంచండి.. కేంద్రం ఆదేశం!

అమెరికా, వెనిజులా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు పెంచాలని IOC, BPCL, HPCL తదితర రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. ‘ట్రేడ్ డీల్‌లో భాగంగా ఎనర్జీ కొనుగోళ్లు పెంచాలని ఇండియా చూస్తోంది. రష్యా ఆయిల్ దిగుమతిని తగ్గించుకోనుంది. స్పాట్ మార్కెట్ టెండర్లలో US గ్రేడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలని రిఫైనరీలను కోరింది. వెనిజులా ఆయిల్‌ను ట్రేడర్లతో ప్రైవేట్ చర్చల ద్వారా కొనాలని చెప్పింది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


