News April 11, 2024
రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 3/3

బెంగాల్‌లో SCలుగా గుర్తింపు పొందిన వీరి జనాభా సుమారు 50లక్షలు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. బీజేపీ గతఏడాది అనంతరాయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. మరోవైపు TMC వీరికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, వీరు ఆరాధించే పంచానన్ బర్మా జయంతిని సెలవుగా ప్రకటించింది. అస్సాంలోనూ ఓబీసీలుగా చెలామణి అవుతున్న వీరి ఓట్లు కీలకంగా మారాయి. <<-se>>#Elections2024<<>>
Similar News
News March 12, 2026
మనుషులూ 200 ఏళ్లు బతకొచ్చు!

భూమిపై ఎక్కువకాలం బతికే జీవుల్లో తిమింగలం ఒకటి. అందులోనూ Bowhead రకం 200 ఏళ్లు జీవిస్తుంది. దీని దీర్ఘాయువుకు క్యాన్సర్, ఇతర వ్యాధుల నియంత్రణకు DNA రిపేర్ ప్రొటీన్‌గా పిలిచే CIRBP కారణమని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని మానవ కణాలు, కొన్ని రకాల ఈగల్లో ప్రవేశపెట్టగా DNA రిపేర్ సాధ్యమైంది. ఈగలు ఎక్కువ కాలం జీవించాయి కూడా. మానవుల్లోనూ సక్సెస్ అయితే 200Y బతకడం సాధ్యమేనంటున్నారు.
News March 12, 2026
మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 12, 2026
యుద్ధం.. అమెరికాకు 6 రోజులకే రూ.లక్ష కోట్లు

ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న అమెరికాకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తొలి 6 రోజులకే $11.3Bn(₹1.04L Cr) వ్యయమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. క్లోజ్డ్ డోర్‌లో జరిగిన భేటీలో US శాసనసభ్యులకు పెంటగాన్ ప్రతినిధులు ఈ విషయాన్ని తెలిపారని పేర్కొంది. ఆపరేషన్ ప్లానింగ్, సైనికులు, ఆయుధాల తరలింపు సహా అనేక ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు మరింత పెరుగుతుందని తెలిపింది.


