News August 28, 2024
గణేశ్ మండపాలు పెట్టేవారికి రూల్స్(1/2)

TG: హైదరాబాద్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు పోలీసులు పలు నిబంధనలు విధించారు.
✒ పబ్లిక్ రోడ్లు, కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దు.
✒ భక్తుల రద్దీ, గాలి, వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి.
✒ రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ఇరుగుపొరుగు వారికి, వృద్ధులు/ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
✒ లక్కీ డిప్లు, లాటరీలు, బలవంతపు నగదు సేకరణ చేయరాదు.
Similar News
News December 10, 2025
పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
News December 10, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
ప్రయాణికుల ప్రైవేట్ వీడియోలు తీసి..

ప్రయాణికుల ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన UPలో జరిగింది. కొత్తగా పెళ్లైన జంట పూర్వాంచల్ హైవేపై కారులో రొమాన్స్ చేస్తుండగా స్థానిక టోల్ప్లాజా సిబ్బంది అశుతోష్ సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తర్వాత వీడియో చూపించి వారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. మనీ ఇచ్చినా వీడియోను SMలో వైరల్ చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైట్ ఇవ్వగా అశుతోష్ అలాంటి వీడియోలెన్నో రికార్డ్ చేసినట్లు తేలింది.


