News September 16, 2024
రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్

TG: కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ₹1.5లక్షలు, పట్టణాల్లో ₹2లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలన్నారు.
Similar News
News July 11, 2025
కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <
News July 11, 2025
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
News July 10, 2025
అరుదైన రికార్డు సృష్టించిన రూట్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్(81*) అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 33 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్ చేశారు.