News September 11, 2025
మహాలయ పక్షంలో పాటించాల్సిన నియమాలు

<<17645864>>మహాలయ పక్షాల్లో<<>> శుభకార్యాలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఇవి పితృదేవతలను స్మరించుకోవడానికి కేటాయించిన రోజులని అంటున్నారు. ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. * ఒంటిపూట భోజనం, భూశయనం చేయాలి. * మద్యమాంసాలు ముట్టుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. * జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. * కాకులకు ఆహారం ఇవ్వాలి. * పేదలకు వస్త్రదానం చేయాలి. * బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.
Similar News
News March 23, 2026
ఖరీఫ్‌కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.
News March 23, 2026
రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.
News March 23, 2026
హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.


