News January 29, 2025
ప్యాలెస్ నుంచి పాలన.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?: హరీశ్ రావు

TG: జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి CM రేవంత్ పాలన సాగిస్తున్నారంటూ BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రజాపాలన అంటివి, క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ అంటివి. రోజూ ప్రజలను కలుస్తా అంటివి. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి. అధికారిక నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటూ మంత్రులు, అధికారులను నీ వద్దకు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 5, 2026
HOT TOPIC: ఆంధ్రకూ పాకిన జలజగడం…

TGలో INC, BRSల వరకే ఉన్న జలజగడం కాస్తా APకీ పాకింది. YCP విమర్శలతో ‘రాయలసీమ లిఫ్ట్’ పై రేవంత్ చేసిన కామెంట్లను AP GOVT ఖండించింది. దానివల్లే తాను TDPని వదిలానని రేవంత్ విమర్శలు చేశారు. దీంతో నదీ జలాలపై రిప్లైకి CBN సిద్ధమవుతున్నారు. అటు ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా నదీ జలాలపై వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారాయి.
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.
News January 5, 2026
మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <


