News August 17, 2024
గౌతమ్‌తో ‘మురారి’ సీక్వెల్ వార్తలు అవాస్తవం: కృష్ణవంశీ

మహేశ్‌బాబు నటించిన ‘మురారి’ ఇటీవల రీరిలీజ్‌లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. దీంతో సూపర్ స్టార్ కొడుకు గౌతమ్‌తో సీక్వెల్ రాబోతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలను డైరెక్టర్ కృష్ణవంశీ ఖండించారు. సీక్వెల్ ఆలోచన లేదని Xలో స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గౌతమ్ లండన్‌లో యాక్టింగ్‌పై శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Similar News
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.


