News November 17, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు
తిరుమలలో ఓ వర్గం వారు అన్యమత ప్రచారం చేశారనే వదంతులు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. పాప వినాశనం దగ్గర అన్య మతస్తులు రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Similar News
News November 17, 2024
‘పుష్ప’ నటుడి ఎంగేజ్మెంట్
కన్నడ నటుడు డాలీ ధనంజయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ధన్యత అనే డాక్టర్తో ఇవాళ ఆయన నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక హసన్ జిల్లాలోని ఆయన ఇంట్లో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్లో వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా, ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డిగా ధనంజయ నటించిన విషయం తెలిసిందే.
News November 17, 2024
నిరుద్యోగులకు మంత్రి కీలక సూచనలు
TG: ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. ఆరోగ్య శాఖలో 11 నెలల్లోనే 7వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. దళారుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 17, 2024
రేపు అసెంబ్లీలో కీలక తీర్మానాలు
AP అసెంబ్లీలో రేపు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలు, యూజర్ కన్సల్టింగ్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను రెండేళ్ల కాలానికి సభ్యులుగా ఎన్నుకునేలా తీర్మానం ప్రవేశపెడతారు.
రేపు అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అలాగే బడ్జెట్ సహా పలు అంశాలపై రేపు చర్చలు జరగనున్నాయి.