News October 11, 2025

175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

image

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్‌ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.

Similar News

News October 11, 2025

టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?

image

ఫోర్బ్స్ ఇండియా <<17957747>>జాబితాలో<<>> దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి(రూ.88,000 కోట్లు) 25వ స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ చీఫ్స్ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి 86వ, హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి 89వ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి 91వ స్థానంలో ఉన్నారు.

News October 11, 2025

రిమాండ్ రిపోర్ట్: మద్యం బాటిళ్లకు ఫినాయిల్ స్టిక్కర్లు!

image

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టైన <<17969515>>జనార్దన్‌రావు<<>> రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ‘నిందితుడు 2012లో మద్యం వ్యాపారం స్టార్ట్ చేసి కరోనాతో ఆర్థికంగా నష్టపోయాడు. 2021 నుంచి HYDలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో లిక్కర్ పోసి డౌట్ రాకుండా ఫినాయిల్ స్టిక్కర్లు వేసేవాడు. ఆపై ఇబ్రహీంపట్నం ANR బార్‌కు తెచ్చి విక్రయించేవాడు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

News October 11, 2025

2,253 పదాలతో పేరు.. గిన్నిస్ రికార్డు

image

మీ పేరులో ఎన్ని పదాలు ఉంటాయి. గరిష్ఠంగా అయితే 7-10 వరకు ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ పేరు ఏకంగా 2,253 పదాలతో ఉంది. రికార్డుల కోసం కొందరు చేసే విచిత్రమైన పనులను చూసి తనకు ఈ ఆసక్తి కలిగిందని లారెన్స్ తెలిపారు. 1990లో పేరును 2వేలకు పైగా పదాలకు పెంచుకొనేందుకు కోర్టును ఆశ్రయించగా ఇటీవల అనుమతి వచ్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు.