News June 25, 2024
రూపే కార్డులదే హవా!

డెబిట్ కార్డు మార్కెట్లో భారత్కు చెందిన రూపే కార్డులదే 69% వాటా (2023) అని ‘ఫిబెనాచీ ఎక్స్’ సంస్థ వెల్లడించింది. కేంద్రం ప్రోత్సాహంతో రూపేలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోరెక్స్ కార్డులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. జన్ధన్ ఖాతాలు ఉన్న వారికి రూపే డెబిట్ కార్డులు మంజూరు చేయడం, UPIకి రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునే సదుపాయం ఉండటంతో దీనికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపింది.
Similar News
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


