News June 20, 2024
రూపాయి పడిపోతోంది!

US డాలర్ దెబ్బకు భారతీయ రూపాయి మరింత దిగజారింది. ఈరోజు ఓ దశలో జీవితకాల కనిష్ఠాన్ని (₹83.68) తాకి మార్కెట్లు ముగిసే సమయానికి 17 పైసల నష్టంతో 83.61 వద్ద స్థిరపడింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 2నెలల కనిష్ఠానికి పడిపోయింది. చివరగా ఈ విలువ ఏప్రిల్ 16న నమోదైంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, ఆయిల్ ధరలు పెరగడంతో డాలర్ విలువ పెరిగి మిగతా కరెన్సీల పతనానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 8, 2025
న్యూస్ రౌండప్

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్
News November 8, 2025
త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.
News November 8, 2025
హెల్మెట్ లేదని రూ.21లక్షల ఫైన్.. చివరికి

హెల్మెట్ లేదని ఓ వ్యక్తికి పోలీసులు ఏకంగా రూ.20,74,000 లక్షల చలాన్ వేశారు. UPలోని ముజఫర్‌నగర్‌కు చెందిన అన్మోల్ స్కూటర్‌పై వెళ్తుండగా హెల్మెట్ లేదని పోలీసులు ఆపారు. బండిని సీజ్ చేసి చలాన్ రశీదు ఇచ్చారు. అమౌంట్ చూసి అన్మోల్ షాక్ అయ్యాడు. దాన్ని ఫొటో తీసి SMలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై అన్మోల్ ప్రశ్నించగా పోలీసులు దాన్ని రూ.4000గా మార్చారు. టెక్నికల్ సమస్య వల్ల ఎక్కువ వచ్చిందన్నారు.


