News November 12, 2024

Rupee Value: 2011లో ₹44.. ఇప్పుడు ₹84.38

image

2011లో డాల‌ర్‌తో పోలిస్తే ₹44గా ఉన్న‌ రూపాయి విలువ సోమ‌వారం జీవిత‌కాల క‌నిష్ఠానికి చేరింది. డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి డిప్రిసియేష‌న్ ₹84.38కి చేరి 48% విలువ త‌గ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి FIIల డిజిన్వెస్ట్‌మెంట్‌, కంపెనీల Q2 ఫ‌లితాలు మెప్పించ‌క‌పోవ‌డం, ట్రంప్ గెలుపుతో డాల‌ర్ మ‌రింత బలపడే అవకాశం ఉండ‌డంతో రూపాయి విలువ మ‌రింత ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Similar News

News November 26, 2025

జగిత్యాలలో శాంతియుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 7 మండలాల్లో 122 పంచాయతీలకు, రెండవ విడతలో 144, మూడవ విడతలో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

News November 26, 2025

రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

image

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్‌కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News November 26, 2025

తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

image

SA క్రికెట్‌లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్‌ అయ్యారు. 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.