News January 3, 2025

12 ఏళ్లలో భారీగా తగ్గిన గ్రామీణ పేదరికం

image

దేశ గ్రామీణ పేదరిక నిష్పత్తి భారీగా తగ్గిందని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. FY12లో 25.7% ఉండగా FY24 నాటికి 4.86 శాతానికి తగ్గినట్లు తెలిపింది. ఇదే కాలంలో అర్బన్ పావర్టీ 4.6 నుంచి 4.09 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రభుత్వ మద్దతు, DBT, ఆహార ధరల్లో మార్పులు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి మెరుగుపడటం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం పావర్టీ తగ్గడానికి దోహదం చేశాయని అభిప్రాయపడింది.

Similar News

News October 30, 2025

అజహరుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు: భట్టి

image

TG: దేశ క్రికెట్‌కు సేవలందించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించడం సరికాదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. దీనిని స్వాగతించకుండా ECకి <<18147731>>లేఖ<<>> రాయడం దారుణమని చెప్పారు. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించరని మండిపడ్డారు. దీనిపై BJP, BRS కలిసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీ అన్న ద్వేషంతోనే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు.

News October 30, 2025

అసలు ఎవరీ శివాంగీ సింగ్..

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా యుద్ధ విమాన పైలట్‌ శివాంగీ సింగ్‌తో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అసలెవరీమె అంటూ చర్చ మొదలైంది. శివాంగీ వారణాసిలో పుట్టి పెరిగారు. చదువుకొనేటప్పుడే NCCలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికై మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపారు. అలా 2020లో రఫేల్ మొదటి మహిళా పైలెట్‌గా చరిత్ర సృష్టించారు.

News October 30, 2025

6వ తరగతి నుంచి ఆయుర్వేద పాఠాలు

image

దేశవ్యాప్తంగా ఇకపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఆయుర్వేదాన్ని బోధించనున్నారు. NEPలో భాగంగా సైన్సు సబ్జెక్టులో ఈ అంశాల్ని చేర్చాలని అధికారులు నిర్ణయించారు. 6-8వ తరగతి వరకు ఈ పాఠాలుంటాయి. ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణంపై భారతీయ దృక్కోణంతో అవగాహన కలిగించడమే లక్ష్యమని NCERT డైరక్టర్ దినేశ్ ప్రసాద్ తెలిపారు. స్కూల్ స్థాయి నుంచి ఆరంభమైన దీన్ని రానున్న కాలంలో డిగ్రీ కోర్సులకూ విస్తరించే అవకాశముంది.