News October 11, 2025
10,000+ జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలు: Dy.CM

AP: 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు <<17972541>>Dy.CM పవన్<<>> తెలిపారు. రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ MPDO కేడర్‌కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 11, 2025
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

AP: విజయనగరంలోని జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, PGDCA అర్హతగల అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. డిగ్రీ, పీజీడీసీఏలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/
News October 11, 2025
ఈ నెల 14న తెలంగాణ బంద్: R.కృష్ణయ్య

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు సీఎం రేవంత్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
News October 11, 2025
శివుడి అష్ట మూర్తులు

1. శివుడు/శర్వుడు – పృథ్వీ మూర్తి
2. భవుడు – జల మూర్తి
3. పశుపతి – అగ్ని మూర్తి
4. ఈశానుడు – వాయు మూర్తి
5. భీముడు – ఆకాశ మూర్తి
6. రుద్రుడు – సూర్య మూర్తి
7. మహాదేవుడు – సోమ మూర్తి
8. ఉగ్రుడు – యజమాన మూర్తి
<<-se>>#Sankhya<<>>