News October 10, 2025
రుషికొండ ప్యాలెస్.. నెలకు రూ.25 లక్షల ఖర్చు!

AP: విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నుంచి ఆదాయం వచ్చేలా దాన్ని ఎలా వాడుకోవాలనే అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అది నిరుపయోగంగా ఉండటం వల్ల నెలకు రూ.25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని మంత్రులు పయ్యావుల, DBV స్వామి, దుర్గేశ్ అన్నారు. కాగా వైసీపీ హయాంలో దీన్ని రూ.409 కోట్లతో నిర్మించారు.
Similar News
News October 10, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం అత్యధికంగా కోనసీమ(D) నగరంలో 46MM, మలికిపురంలో 36.2MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News October 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 31 సమాధానాలు

1. విశ్వామిత్రుని ఆశ్రమం ‘సిద్ధారామం’.
2. బర్బరీకుడి తండ్రి ‘ఘటోత్కచుడు’.
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
4. కామ దేవుని వాహనం ‘చిలుక’.
5. సంస్కృతంలో కూడా లక్షను లక్ష అనే అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 10, 2025
మొదటి ద్వారం నుంచే శ్రీవారిని చూసే అవకాశం

శ్రీవారి దివ్య రూపాన్ని బంగారు వాకిలి(మొదటి గడప) నుంచి వీక్షించే భాగ్యాన్ని TTD కల్పిస్తోంది. సాధారణ దర్శనం ఏడో ద్వారం నుంచి జరుగుతుంది. సుప్రభాత, తోమాల వంటి సేవలను అతి చేరువ(10ft) నుంచి చూసి తరించవచ్చు. ఈ అవకాశం లక్కీ డిప్ ద్వారా ఎంపికైనవారికి లభిస్తుంది. ప్రతి నెలా 18వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.