News April 13, 2025
కీవ్‌లోని భారతదేశ ఫార్మా గౌడౌన్‌పై రష్యా దాడులు: ఉక్రెయిన్

తమ దేశంలోని కీవ్‌లో ఉన్న భారత్‌కు చెందిన ఓ ఫార్మా గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్‌తో మైత్రి ఉందని చెబుతూనే ఉద్దేశపూర్వకంగా ఆ దేశ వ్యాపారాలను మాస్కో టార్గెట్ చేస్తోందని INDలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ దాడితో పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులు నాశనం అయినట్లు వివరించింది. కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై భారత్, రష్యా ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.
Similar News
News April 13, 2025
భారీ అగ్నిప్రమాదం.. మృతులు వీరే

AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలో జరిగిన <<16086158>>అగ్నిప్రమాదంలో<<>> 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతులను అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవింద్ (45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల (38), పురం పాప (40), గుంపిన వేణుబాబు (40), సేనాపతి బాబురావు (56), మనోహర్‌గా పోలీసులు గుర్తించారు.
News April 13, 2025
KCRపై కోపంతో అంబేడ్కర్‌ను అవమానించొద్దు: కవిత

TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా HYDలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి స్వయంగా CM రేవంత్ నివాళులర్పించాలని BRS MLC కవిత డిమాండ్ చేశారు. KCRపై కోపంతో అంబేడ్కర్‌కు నివాళులర్పించకుండా అవమానించ వద్దన్నారు. ‘మంత్రులతో సహా CM అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించాలి. అలాగే ప్రజలకు కూడా సందర్శించే అవకాశం కల్పించాలి. KCRపై అక్కసుతో ఆ మహనీయుడిని స్మరించడం మరిచిపోవద్దు’ అని పేర్కొన్నారు.
News April 13, 2025
నాని ‘హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైమ్ ఫిక్స్

నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‌ను మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. అలాగే ఉదయం 11.07 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.