News September 24, 2024
అణ్వాయుధాలు రష్యా వద్దే అధికం!

అణుబాంబు పేలితే జరిగే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరు. దీని ప్రభావం కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది. అలాంటి అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. రష్యా వద్ద 5,500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాతి స్థానాల్లో USA(5,044), చైనా(500), ఫ్రాన్స్(290), UK(225), ఇండియా(172) ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 150-160 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేశాయి.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


