News November 30, 2024
ఎదురుదాడి చేసే హక్కు రష్యాకు ఉంది: కిమ్
లాంగ్ రేంజ్ క్షిపణులను వాడటానికి ఉక్రెయిన్కు US అనుమతివ్వడంపై నార్త్ కొరియా నియంత కిమ్ స్పందించారు. ఇది నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుదాడి చేసే హక్కు రష్యాకు ఉంటుందని, శత్రువులు మూల్యం చెల్లించుకునేలా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. తమ దేశంలో పర్యటిస్తున్న రష్యా రక్షణ మంత్రి బెలౌసోవ్తో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొరియా మీడియా వెల్లడించింది.
Similar News
News November 30, 2024
మందుబాబులకు గుడ్న్యూస్.. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు
APలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని బ్రాండ్లపై రేట్లను తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర ₹230 నుంచి ₹210కి, ఫుల్ బాటిల్ ₹920 నుంచి ₹840కి తగ్గింది. మాన్షన్హౌస్ క్వార్టర్ ₹220 నుంచి ₹190కి, ఫుల్ బాటిల్ ₹870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ₹1,600 నుంచి ₹1,400కు తగ్గించి అమ్ముతోంది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది.
News November 30, 2024
పుష్ప-2: వార్ వన్ సైడే!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ మూవీ సోలో రిలీజ్గా వస్తోంది. ఐకాన్ స్టార్ మూవీ వచ్చిన 2 వారాలకు డిసెంబర్ 20న బచ్చలమల్లి(అల్లరి నరేశ్), యూఐ(ఉపేంద్ర), విడుదల:పార్ట్ 2, సారంగపాణి జాతకం, ముఫాసా: ది లయన్ కింగ్ రానున్నాయి. DEC 25న రాబిన్ హుడ్, బేబీ జాన్, 27న పతంగ్ రిలీజ్ కానున్నాయి.
News November 30, 2024
ISKCON బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్
హిందువులపై దాడుల్ని పట్టించుకోని బంగ్లాదేశ్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. 17 మంది ISKCON ప్రతినిధుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఆ సంస్థను నిషేధించాలన్న పిటిషన్ను బంగ్లా హైకోర్టు తిరస్కరించిన కొద్ది వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆ అకౌంట్లకు చెందిన అన్ని లావాదేవీలు సస్పెండ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను BFIU ఆదేశించింది. వీటిలో అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ A/C సైతం ఉంది.