News November 21, 2024
తొలిసారి ఉక్రెయిన్‌పై మిసైల్ దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ క్షిపణి దాడులకు రష్యా ప్రతీకార దాడులు ఆరంభించింది. డినిట్రో సిటీ లక్ష్యంగా ICBM క్షిపణిని ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ సేన మిసైల్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈస్ట్రన్ ఉక్రెయిన్‌లోని డల్నె గ్రామాన్ని రష్యా సేనలు ఆక్రమించాయని కీవ్ తెలిపింది.
Similar News
News February 1, 2026
కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.
News February 1, 2026
తెలంగాణ ఏం తప్పు చేసింది: Dy.CM భట్టి

TG: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బయోఫార్మా అంటే తెలంగాణ గుర్తుకొస్తుందని.. కానీ నిధులు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరెంజ్ ఎకానమీ, స్పోర్ట్స్‌కు తెలంగాణ బిగ్గెస్ట్ సెంటర్ అయినా కేంద్రం విస్మరించిందన్నారు. మూసీ ప్రక్షాళన నిధుల కోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసినా ఫలితం లేకపోయిందని.. తెలంగాణ ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు.
News February 1, 2026
ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్-2026పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ X వేదికగా మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ బడ్జెట్ పట్టించుకోలేదని రాసుకొచ్చారు. ‘యువతకు ఉద్యోగాలు లేవు. తయారీ రంగం కుదేలైంది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. సామాన్యుల పొదుపు తగ్గిపోతోంది. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు’ అని ఆరోపించారు. సంక్షోభాలను పరిష్కరించే దిశగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రయత్నం చేయలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


