News October 19, 2024

రష్యా-ఉక్రెయిన్ మధ్య 190 మంది ఖైదీల మార్పిడి

image

రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. UAE మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు 190 మంది(చెరో 95 మంది) యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని రష్యన్ రక్షణ శాఖ ధ్రువీకరించగా, కీవ్ ఇంకా స్పందించలేదు. గత నెలలో జరిగిన డీల్‌లో 206 మంది స్వదేశాలకు చేరుకున్నారు. అలాగే గత శుక్రవారం 501 మృతదేహాలను ఉక్రెయిన్, 89 బాడీలను రష్యా మార్పిడి చేసుకున్నాయి.

Similar News

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల నిరసనపై రాహుల్ స్పందించాలి: హరీశ్

image

TG: ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా? రాహుల్ గాంధీ తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

News October 19, 2024

గ్రేట్.. చెట్లను కాపాడేందుకు రెండేళ్లు పోరాటం!

image

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జులియా హిల్ పర్యావరణ పరిరక్షకురాలు. 1997లో ఓ కంపెనీ చైర్ల తయారీ కోసం వెయ్యేళ్ల భారీ వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో జులియా ఓ వృక్షంపైకి ఎక్కి 200 ఫీట్ల ఎత్తులో నిరసన తెలిపారు. చలి, కుండపోత వర్షాలను ఎదుర్కొని 738 రోజులు దిగకుండా చెట్టుపైనే ఉండిపోయారు. కంపెనీ వెనకడుగేయడంతో ఆమె తన పోరాటంలో విజయం సాధించారు. కొన్నిరోజుల్లోకే ఆ కంపెనీ దివాలా తీసింది.

News October 19, 2024

VIRAL: కాలుష్య కాసారంగా యమునా నది

image

పైన ఫొటో చూసి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, వంజంగి అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరపడినట్లే. ఫొటోలో కనిపించేవి కొండల నడుమ ఉన్న మేఘాలు కావు. విషపూరితమైన నురగ. దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది విషపూరితమై నురగలు కక్కుతోంది. నది ఇంత ప్రమాదకరంగా మారినప్పటికీ పట్టించుకోకపోవడంతో అక్కడి ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు.