News December 16, 2024
త్వరలో రష్యా వీసా ఫ్రీ

వీసా లేకుండానే భారతీయులు రష్యాలో పర్యటించే అవకాశం త్వరలోనే రానుంది. అక్కడ పర్యటించే ఇండియన్స్ సంఖ్య పెరుగుతుండటంతో వీసా ఫ్రీ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏ పనిపై వచ్చారన్న సమాచారం ఆధారంగా వీసాలు మంజూరు చేస్తారు. భారతీయుల విషయంలో వీసా రూల్స్ సడలించాలని జూన్లో భారత్-రష్యా అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం టూరిస్ట్, బిజినెస్, ఉద్యోగం, స్టూడెంట్ సహా పలు రకాల వీసాలున్నా, వీటి మంజూరుకు సమయం పడుతుంది.
Similar News
News January 15, 2026
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
News January 15, 2026
NI-MSMEలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(NI-MSME) 2 కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ, BCom,MCom,CA,CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ recruitment@nimsme.gov.in ద్వారా అభ్యర్థులు జనవరి 30 వరకు అప్లై చేసుకోవాలి. వెబ్సైట్: https://www.nimsme.gov.in/
News January 15, 2026
‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీకి తొలి రోజు వచ్చిన కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.22కోట్ల గ్రాస్ సాధించినట్లు ‘ఇంటిల్లిపాది నవ్వుల సునామీ’ పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్ కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇదే అత్యధికం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిన్న రిలీజైన మూవీ కామెడీ ఇష్టపడే ఆడియన్స్ను అలరిస్తోంది.


