News December 29, 2024
రష్యా వల్లే విమానం కూలింది: అజర్ బైజాన్ Prez
కజకిస్థాన్‌లో తమ దేశ విమానం కూలిపోయిన ఘటన వెనుక రష్యా హస్తం ఉందని అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ ఆరోపించారు. భూతల కాల్పుల వల్లే దెబ్బతిన్న తమ విమానం కూలిపోయిందన్నారు. రష్యాలోని కొన్ని వర్గాలు ఈ ఘటన వెనకున్న వాస్తవాల్ని దాచిపెట్టి తప్పుడు కథనాల్ని వ్యాప్తిలోకి తెచ్చాయని అలియేవ్ పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమన్న పుతిన్, బాధ్యత వహించకపోవడం గమనార్హం.
Similar News
News January 1, 2025
దావోస్‌కు వెళ్లనున్న CBN, లోకేశ్
AP: జనవరి 20 నుంచి 24 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల 19న సీఎం, లోకేశ్, పరిశ్రమలు, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు అక్కడికి బయల్దేరనున్నారు. సాంకేతిక పాలన, రెన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఇందుకోసం కేంద్రం సదస్సులో ఏపీకి స్టాల్ రిజర్వ్ చేసింది.
News January 1, 2025
మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు.. సీఎం ఆదేశాలు
TG: హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్‌కు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ (23 కి.మీ.), JBS నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట్ (22 కి.మీ.) వరకు రెండు కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే DPRలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
News January 1, 2025
తమ్ముడితో హీట్ ఫైటింగ్.. బ్రదర్స్‌తో కూల్ మీటింగ్
ప్రత్యర్థి ఆటగాళ్లతో ఫైటింగ్ గ్రౌండ్ వరకే పరిమితమని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. మెల్‌బోర్న్ టెస్టులో ఆసీస్ ప్లేయర్ శామ్ కోన్ట్సస్‌ను కోహ్లీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక అతని సోదరులు బిల్లీ, జానీ రన్ మెషీన్‌ను కలిసి ఫొటో దిగారు. అతనితో సరదాగా మాట్లాడారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లీ గ్రౌండులో ఏం చేసినా జట్టు కోసమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.