News March 29, 2024
సముద్రంలో కుప్పకూలిన రష్యా యుద్ధవిమానం

రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Similar News
News February 1, 2026
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ నేపథ్యంలో ఒడుదొడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1546 పాయింట్ల నష్టంతో 80,722కు చేరగా నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో TCS, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టైటాన్ మినహా మిగతా షేర్లు అన్ని నష్టాలతోనే ముగిశాయి. F&Oకు సంబంధించిన సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ పెంచడం మార్కెట్లపై ప్రభావం చూపింది.
News February 1, 2026
అదే మా లక్ష్యం.. బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్

ఆర్థిక వృద్ధి కొనసాగాలన్నదే తమ ప్లాన్ అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీని కోసం సిస్టమ్‌లోమార్పులు చేస్తున్నామని, మున్ముందూ జరుగుతూనే ఉంటాయని బడ్జెట్‌పై మాట్లాడారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని.. దానికి తగ్గ వాతావరణాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సామాన్యుడికి ఉపయోగపడేలా చూస్తామన్నారు. క్యాపెక్స్‌ను భారీగా పెంచామని గుర్తుచేశారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
News February 1, 2026
NRIలకు గుడ్‌న్యూస్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు బూస్ట్!

బడ్జెట్‌లో NRIs కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (PIS) పరిమితులను ప్రభుత్వం భారీగా పెంచింది. వ్యక్తిగత పెట్టుబడి లిమిట్‌ను 5% నుంచి 10%కి, అలాగే NRIల మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి 24%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారతీయ కంపెనీల్లో NRIలు మరింత మెరుగైన వాటా పొందే అవకాశం ఉంటుంది.


