News April 18, 2024
రష్యా మిస్సైల్స్ అటాక్.. 17 మంది మృతి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని చెర్నివ్ సిటీపై రష్యా 3 మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్పై మిస్సైల్స్ పడటంతో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61 మంది గాయపడ్డారు.
Similar News
News January 15, 2025
పండుగ వేళ తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
AP: సంక్రాంతి వేళ పల్నాడు(D) అచ్చంపేట(M) చామర్రులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోయారు. గౌతుకట్ల కోటయ్య అనే వృద్ధుడు(80) అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అతని కొడుకు గౌతుకట్ల నాగేశ్వరరావు, బావమరిది తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగారు. వెంటనే విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు.
News January 15, 2025
ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్
వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
News January 15, 2025
రేపు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.