News December 24, 2024
రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.
Similar News
News December 2, 2025
నల్గొండ: గ్రామాల్లో అంతర్గత పోరుతో రాజకీయ హీట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నుంచి పలువురు నేనే సర్పంచ్ అంటూ బరిలో దూసుకురావడంతో అంతర్గత పోరు మొదలైంది. ఇతర పోస్టులు సర్దుబాటు చేస్తామని నేతలు బుజ్జగిస్తున్నా వినకుండా స్వతంత్రగానైనా పోటీ చేస్తామంటూ సిద్ధం కోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 2, 2025
మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.


