News February 7, 2025

రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌పై వేటు

image

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ చీఫ్ యూరీ బొరిసోవ్‌ను పుతిన్ తొలగించారు. అతడి స్థానంలో డిప్యూటీ రవాణామంత్రి దిమిత్రీ బకనోవ్‌ను నియమించారు. 2022 జులై నుంచి యూరీ రాస్‌కాస్మోస్‌ చీఫ్‌గా ఉన్నారు. ఆయన హయాంలోనే 2023లో చంద్రుడిపైకి పంపిన లూనా-25 మిషన్ విఫలమై చంద్రుడి ఉపరితలంపై పడిపోయింది. రోదసి పరిశోధనల్లో సంస్థ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండటమే తొలగింపు వెనుక కారణమని తెలుస్తోంది.

Similar News

News April 2, 2026

VZM: “ముగిసిన టెన్త్ పరీక్షలు 99.76 శాతం హాజరు”

image

గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షతో టెన్త్ పరీక్షలు ముగిసినట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. పరీక్షకు మొత్తం 22,938 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా వారిలో 22,883 మంది విద్యార్దులు హాజరయ్యారన్నారు. 55 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. మార్చి 16 నుంచి జరిగిన పరీక్షలకు సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి, పోలీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మూల్యాంకనం చేపడతామన్నారు.

News April 2, 2026

పబ్లిక్ ప్లేసుల్లో పిల్లలపై కోప్పడుతున్నారా?

image

బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్టులు సూచిస్తున్నారు. ‘తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పబ్లిక్ ప్లేసుల్లో మర్యాదగా, గౌరవంగా మాట్లాడితే, దయతో వ్యవహరిస్తే వాళ్లూ అదే ఫాలో అవుతారు. మంచి నడవడిక, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అరవడం, తిట్టడం, చెడుగా మాట్లాడటం వారిపై ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో వాళ్లూ అలానే ప్రవర్తించవచ్చు’ అని చెబుతున్నారు.

News April 2, 2026

IIFCLలో 33 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. అప్లై చేశారా?

image

33 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (IIFCL), న్యూఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. MBA/ PGDBMలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 10.04.26 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.iifcl.in చూడండి.