News March 23, 2024
రష్యా ఉగ్రదాడి.. 150కి చేరిన మృతుల సంఖ్య

రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా ఇప్పటికే 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఉక్రెయిన్తో సంబంధం ఉందని అందుకే వారు ఆ దేశంలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని రష్యా సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.
Similar News
News September 16, 2025
పంటకు అధిక యూరియాతో కలిగే నష్టాలు

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.
News September 16, 2025
ప్రీఎక్లంప్సియాను ముందుగానే గుర్తించొచ్చు!

కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీలో మూత్రం నుంచి ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీన్నే ప్రీఎక్లంప్సియా అంటారు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. దీనికోసం IITమద్రాస్ పరిశోధకులు ఒక టెస్ట్కిట్ అభివృద్ధి చేశారు. ఒక్కచుక్క రక్తంతో టెస్ట్ చేస్తే అరగంటలోనే ఫలితం వస్తుంది. P-FAB టెక్నాలజీతో ఇది పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ VV రాఘవేంద్రసాయి వెల్లడించారు.
News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.