News April 28, 2024
రాణించిన రుతురాజ్.. SRH ముందు భారీ టార్గెట్

SRHతో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన CSK భారీ స్కోర్ నమోదు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. 54బంతుల్లో 98 రన్స్ చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. మిచెల్ (52) హాఫ్ సెంచరీ చేయగా.. శివం దూబే (39) మెరుపులు మెరిపించారు. దీంతో 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 212 రన్స్ చేసింది. SRH టార్గెట్ ఛేజ్ చేస్తుందా? కామెంట్ చేయండి.
Similar News
News December 16, 2025
ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్లో 70% వాటా!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT
News December 16, 2025
పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.
News December 16, 2025
32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.


