News March 22, 2025

RVPM: రూపాయికి పది రూపాయిలు ఇస్తామంటూ మోసం

image

రూపాయికి పది రూపాయలు ఇస్తామని, తమ వద్ద మహిమ కలిగిన సూర్యనందని రాళ్లు ఉన్నాయంటూ తమను మోసం చేశారని రావులపాలానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి, ఆయన స్నేహితులు శుక్రవారం వాపోయారు. తాము రూ.1.15 కోట్లు ఇచ్చి మోసపోయామన్నారు. కృష్ణా(D) గుడివాడకు చెందిన భార్య, భర్త బ్యాంకు కన్సల్టెంట్‌గా వచ్చి ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. వీరితో పాటు పలువురు బాధితులు లక్షల్లో డబ్బు ఇచ్చి మోసపోయారని చెబుతున్నారు.

Similar News

News February 24, 2026

ఉమ్మడి WGL: CC కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు..!

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ ఎగ్జామ్స్ బుధవారం, సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షా సమయం. హాల్ టికెట్లపై ఉన్న QR కోడ్ ద్వారా సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. ఉమ్మడి WGK వ్యాప్తంగా CC కెమెరాల నిఘాలో 75,277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. WGL- 12166, HNK- 38600, JN-8605, MHBD-8287, BHPL- 3778, MLG- 3841.

News February 24, 2026

టీచర్ కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే

image

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET-2026) <>దరఖాస్తుల<<>> ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో 4ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ITEP)లో ప్రవేశాల కోసం NTA ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్ చదువుతున్న/పాసైనవారు అర్హులు. ఏప్రిల్ 17న పరీక్ష ఉంటుంది. ఇంటర్ తర్వాత B.A/BSc/BComతో పాటు B.Ed ఒకేసారి పూర్తి చేసేలా ఈ 4yrs కోర్సును రూపొందించారు.

News February 24, 2026

పల్నాడులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు

image

సత్తెనపల్లిలో విజిలెన్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక వడ్డవల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3,31,060ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకపోవడం, నాసిరకం, నాణ్యత, COTPA చట్టం ఉల్లంఘనపై కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రవణ్ కుమార్ వివరించారు.