News December 5, 2024
RWS అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన కలెక్టర్

కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మండలాలవారీగా తాగునీటి పథకాల మరమ్మతు పనులు, అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణాలు, మరమ్మతు పనుల గురించి సమీక్షించారు. CSR, ఎంపీ ల్యాడ్స్, జిల్లా మినరల్ ఫండ్స్‌తో ఈ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని RWS అధికారులకు కలెక్టర్ DK బాలాజీ ఆదేశాలిచ్చారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలంటూ జేసీకి వినతి

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని వైసీపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలార్ దాదా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంజుమన్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు అని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 9, 2026
కృష్ణా: ‘ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి’

జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో RBI ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు.
News February 9, 2026
కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


