News March 5, 2025
RWS-1 యాప్‌ను ఉపయోగించుకుని తాగునీటి సరఫరా చేయాలి: కలెక్టర్

RWS-1 యాప్‌ను ఉపయోగించుకుని అవసరమైన ప్రదేశాలలో తాగునీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తదితరులతో వేసవికాలంలో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు 536 నివాసాలలో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 12, 2026
నల్గొండ: తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి..!

మహాత్మాగాంధీ వర్సిటీ అవుట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు సకాలంలో జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు వేతనాలను నిలిపివేశారు. ఫలితంగా 113 మంది చిరుద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య సామాన్య కార్మికులు బలిపశువులవుతున్నారు.
News April 12, 2026
ఉమ్మడి అనంత జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి

సూర్యుడి ప్రతాపానికి ఉమ్మడి అనంత జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోపక్క ఈ నెల 20వ తేదీ వరకు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 42.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వడగాలులు వీస్తాయన్నారు.
News April 12, 2026
బీబీనగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

బీబీనగర్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


