News March 5, 2025
RWS-1 యాప్‌ను ఉపయోగించుకుని తాగునీటి సరఫరా చేయాలి: కలెక్టర్

RWS-1 యాప్‌ను ఉపయోగించుకుని అవసరమైన ప్రదేశాలలో తాగునీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తదితరులతో వేసవికాలంలో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు 536 నివాసాలలో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
Similar News
News September 15, 2025
VJA: వాట్సాప్‌లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.
News September 15, 2025
కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News September 15, 2025
కృష్ణ: 100 ఏళ్ల నాటి నిజాం కాలం వంతెన

నిజాం కాలంలో నిర్మించిన పురాతన రాతి వంతెన వందేళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గచ్చుతో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు కూడా అవసరం రాలేదు. NRPT జిల్లా కృష్ణ మండలం వాసునగర్- శక్తి నగర్ మధ్య ఈ వంతెన నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్)తో ఈ వంతెన నిర్మించారు. ఖానా మధ్యలోని రాయి భారం మోస్తుందని ఇంజినీరింగ్‌ల అభిప్రాయం. నేడు ఇంజినీర్ల దినోత్సవం.