News July 9, 2024
రైతు భరోసా.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వర్క్ షాప్లు నిర్వహించనుంది. 10న ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డిలో వర్క్ షాప్లు జరగనున్నాయి.
Similar News
News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.
News December 21, 2024
కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్మీట్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
News December 21, 2024
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.