News September 6, 2024
రైతు బీమా: ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా, పథకం సజావుగా అమలయ్యేలా యాప్ను తయారు చేయనుంది. దీని ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయడం వంటివి సులభతరం అవుతాయని భావిస్తోంది. 18-60ఏళ్ల లోపు రైతులు ఏ కారణం వల్లనైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం ఈ పథకం కింద ₹5లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.


