News May 10, 2024
కెనడాపై ఎస్ జైశంకర్ ఆగ్రహం

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాద శక్తులకు, ఉగ్రవాదులకు ఆ దేశం ఎందుకు ఆశ్రయమిస్తోందని ప్రశ్నించారు. ‘వేర్పాటువాదాన్ని, హింసను సమర్థించేవారికి మద్దతునివ్వడమేనా భావప్రకటనా స్వేచ్ఛ? ఉగ్రశక్తులకు కెనడాలో రాజకీయ అవకాశాలు లభించాయి. అక్కడ ప్రముఖ స్థానాల్లో ఉన్నవారే నేడు భారత వ్యతిరేక కార్యకలాపాలను సమర్థిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News December 9, 2025
మొదటి విడత ప్రచారానికి తెర

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News December 9, 2025
హనుమాన్ చాలీసా భావం – 33

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. అందుకే ఆంజనేయస్వామిని భజిస్తే రాముడిని చేరుకోనే మార్గం సుగగమవుతుందని పండితులు చెబుతారు. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తారు. మారుతీ నామ పఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మ స్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 9, 2025
ECIపై అనుమానాలు దురదృష్టకరం: కాంగ్రెస్ MP

ECI తటస్థ వైఖరిపై అనుమానాలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. CJI, లోక్సభలో LoP EC కమిటీలో ఉండేలా రిఫామ్స్ తేవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల్లో SIR చేపట్టడానికి కారణాలను కేంద్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. ‘EVMలు మానిప్యులేట్ అవుతాయని నేను అనడం లేదు. ఆ ఛాన్స్ ఉందని ప్రజలు భావిస్తున్నారు. 100% VVPATలను మ్యాచ్ చేయాలి లేదా బ్యాలెట్ పేపర్లకు వెళ్లాలి’ అని చెప్పారు.


