News April 4, 2024

SA-2 పరీక్షలు ఈనెల 15కు వాయిదా

image

SA-2 పరీక్షలు ఈనెల 15 కు వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉన్నాయి. కాగా హై స్కూల్ ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలో ఉండటం మూలంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేశారు.

Similar News

News December 18, 2025

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ధాన్యం కొనుగోలు వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం ఆమె అనుముల మండలం కొత్తపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. రిజిస్టర్లు, ధాన్యం తేమ శాతం, తూకం వేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు లోడ్ చేయాలని ఆదేశించారు.

News December 18, 2025

NLG: ముగిసిన పల్లె సంగ్రామం

image

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.

News December 18, 2025

పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

image

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.