News March 11, 2025

శబరిమల: 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

image

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.

Similar News

News November 21, 2025

SRSP: 947.474 TMCల వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.

News November 21, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు US పీస్ ప్లాన్!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు US ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి US 28 పాయింట్లతో కూడిన పీస్ ప్లాన్‌ను అందజేసింది. ఉక్రెయిన్ తన తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవడం, సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించుకోవడం వంటివి అందులో ఉన్నట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండా రూపొందించిన ఈ ప్లాన్‌పై జెలెన్ స్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ట్రంప్‌తో చర్చించే ఛాన్సుంది.

News November 21, 2025

పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

image

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.