News November 25, 2024

శబరిమలకు 9రోజుల్లోనే రూ.41.64కోట్ల ఆదాయం

image

శబరిమల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6.12లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు రూ.41.64కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే సీజన్లో ఆదాయం రూ.13.37కోట్లుగా ఉంది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా సన్నిధానం, పంపా, నీలక్కల్ కొండ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

Similar News

News November 26, 2024

జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని, సమోసాల కోసమే రూ.9కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

News November 26, 2024

BREAKING: రేపు తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు APSDMA వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో 29వ తేదీ వరకు అక్కడక్కడా భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 26, 2024

చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్.. కారణమిదే

image

అతని నెల జీతం రూ.1.20 లక్షలు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. దీంతో పెద్దలు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. తీరా పెళ్లి పీటల మీద కూర్చున్నాక యువతి మనసు మార్చుకుంది. తాను GOVT ఉద్యోగిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది. చేసేదేమీ లేక ఇరు పక్షాలు మ్యారేజ్‌ను రద్దు చేసుకున్నాయి. యూపీ ఫరూఖాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది.