News January 3, 2025
సమాజహితం కోసమే సచ్చిదానందస్వామి పనిచేస్తున్నారు: సీఎం

AP: విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. గణపతి సచ్చిదానందస్వామి ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం తెలిపారు. సమాజహితం కోసమే స్వామి పనిచేస్తున్నారని చెప్పారు. తన కష్టాలు తొలగాలని ఆయన పూజలు చేశారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


