News November 14, 2024
టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సచిన్?

BGT సిరీసుకు టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంటుగా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘BGT2025కు బ్యాటింగ్ కన్సల్టెంటుగా సచిన్ సేవలను వాడుకుంటే భారత్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా’ అని మాజీ క్రికెటర్, కోచ్ WV రామన్ Xలో అన్నారు. NZ సిరీసులో 0-3తో వైట్‌వాష్ కావడంతో ఈ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం సిరీసుల కోసం కన్సల్టెంట్లను నియమించుకోవడం కామన్‌గా మారింది.
Similar News
News November 16, 2025
పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.
News November 16, 2025
STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్

TG: దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తోన్న <<18297457>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉండగా రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పైరసీల ద్వారా అతను రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.


