News October 19, 2024
రచిన్, సర్ఫరాజ్లను అభినందించిన సచిన్

టెస్టులో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ‘క్రికెట్ మన మూలాలను కలుపుతుంది. బెంగళూరుతో రచిన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడే అతను సెంచరీ చేశారు. పరుగుల లోటులో ఉన్న తన జట్టుకు సర్ఫరాజ్ అండగా నిలుస్తూ సెంచరీ బాదారు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లకి మున్ముందు మంచి కాలం ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News December 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 109 సమాధానం

ప్రశ్న: విదురుడు ఎవరి అంశ? ఏ శాపం వల్ల ఆయన దాసీ పుత్రుడిగా జన్మించారు?జవాబు: విదురుడు యముడి అంశ. పూర్వం మాండవ్య మహర్షి తన చిన్నతనంలో ఓ కీటకాన్ని హింసించినందుకు యముడు ‘శూలారోహణ’ అనే కఠిన శిక్ష విధిస్తాడు. పన్నెండేళ్ల లోపు పిల్లలు చేసే పనులు పాపాలు కావని, చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేసినందుకు మహర్షి, యముడిని భూలోకంలో దాసీ పుత్రుడిగా జన్మించమని శపించారు. అలా విదురుడు జన్మించారు.<<-se>>#Ithihasaluquiz<<>>
News December 27, 2025
వంచించడం మాని రైతులకు వాస్తవాలు చెప్పాలి: వేమారెడ్డి

AP: వంచించడం మాని అమరావతి రైతులకు CBN వాస్తవాలు చెప్పాలని YCP నేత వేమారెడ్డి డిమాండ్ చేశారు. ‘మంత్రి సభలోనే రైతు కుప్పకూలడం వారి మౌన ఆక్రందనకు నిదర్శనం. భూమి తీసుకొని ప్లాట్లు, ఉపాధి లేకుండా చేస్తే వారెలా బతకాలి. ₹2.80లక్షల కోట్ల అప్పు చేశారు. అందులో ₹10వేల కోట్లు వారికి కేటాయించలేరా? ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూమి అడగడంపై అనుమానాలున్నాయి. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగలక తప్పదు’ అని ధ్వజమెత్తారు.
News December 27, 2025
బిందుసేద్యంతో నీటి వృథా తగ్గి, పంట దిగుబడి పెరుగుతుంది

బిందుసేద్యంతో సాగునీటివృథాను అరికట్టడమే కాకుండా నీటిని నేరుగా మొక్క వేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయవచ్చు. దీని వల్ల 30-50% నీటిని ఆదా చేయవచ్చు. అతి తేలికైన, ఇసుక, బరువైన నల్లరేగడి నేలలు, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూములు కూడా బిందు సేద్యానికి అనుకూలం. బిందు సేద్యంతో సరైన తేమ, సమపాళ్లలో పోషక పదార్థాలు అందడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయి.


