News October 6, 2024
US నేషనల్ క్రికెట్ ఓనర్‌షిప్‌లోకి సచిన్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్ (NCL) ఓనర్‌షిప్ గ్రూపులో చేరారు. 60 Strikes ఫార్మాట్లో జరిగే ఈ లీగులో విజేతకు ట్రోఫీ అందజేస్తారు. ‘నా లైఫ్‌లో అత్యుత్తమ జర్నీ క్రికెట్. US NCLలో చేరడం హ్యాపీగా ఉంది. కొత్త జనరేషన్లో ఈ టోర్నీ స్ఫూర్తి నింపుతుంది. అమెరికాలో క్రికెట్ వృద్ధిని గమనిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సన్నీ, వెంగీ, రైనా, డీకే, ఉతప్ప ఇందులో భాగమవుతున్నారు.
Similar News
News March 4, 2026
అల్లు ఫ్యామిలీని చూశారా?

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 4, 2026
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.
News March 4, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. 18న ప్రారంభం

AP: దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం(ఇంద్ర ధనుస్సు స్కీమ్)పై RTC MD బాలసుబ్రహ్మణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. వారికి సహాయంగా వచ్చేవారికీ 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.


