News March 27, 2024
రోహిత్‌కు 200వ జెర్సీ అందించిన సచిన్
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 200వ నంబర్ జెర్సీ అందించారు. IPLలో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్‌కు ఇది 200వ మ్యాచ్. అందుకే ఆ నంబర్ ఉన్న జెర్సీతో పాటు క్యాప్‌ను రోహిత్ అందుకున్నారు. ముంబై తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచారు. మొత్తంగా చూస్తే.. మూడో క్రికెటర్. మొదటి రెండు స్థానాల్లో విరాట్ కోహ్లీ (RCB), ధోనీ (CSK) తమ ఫ్రాంచైజీలకు 200కు పైగా మ్యాచ్‌లు ఆడారు.
Similar News
News November 5, 2024
2024 US elections: పోలింగ్ ప్రారంభం
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్, బ్లూ స్టేట్స్‌లో పెద్దగా హడావుడి లేకపోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ల నుంచి కమల, ఆమె రన్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బరిలో ఉన్నారు.
News November 5, 2024
రేపట్నుంచి ఒంటిపూట బడులు
TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
News November 5, 2024
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ఉన్న 33% రిజర్వేషన్లను 35 శాతానికి పెంచేందుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు CM మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.