News April 2, 2025
ముంబై ఫ్రాంచైజీ ఓనర్‌గా సచిన్ కూతురు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా క్రికెట్లోకి అడుగుపెట్టారు. కానీ ప్లేయర్‌గా కాదు ఓనర్‌గా. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్(GEPL)లో ముంబై ఫ్రాంచైజీ యజమానురాలిగా సారా వ్యవహరించనున్నారు. జెట్ సింథెసిస్ నిర్వహించే GEPL.. ఒక ఆన్‌లైన్ గేమింగ్. దీనికి 300మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. Jio సినిమా, స్పోర్ట్స్18లో 2.4 మి. మినిట్స్‌కిపైగా స్ట్రీమింగ్ కంటెంట్ అందుబాటులో ఉంది.
Similar News
News April 3, 2025
నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంకోచించారు. సెన్సెక్స్ 322 నష్టంతో 76,295 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 23,250 వద్ద ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవగా, TCS, టెక్ మహీంద్ర, HCL, ఇన్ఫోసిస్, ONGC షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News April 3, 2025
‘HIT-3’ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ?

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న ‘HIT-3’కి సంబంధించిన క్రేజీ న్యూస్ SMలో చక్కర్లు కొడుతోంది. HIT, HIT-2 క్లైమాక్స్‌లో కొత్త హీరోను పరిచయం చేస్తూ సీక్వల్స్‌పై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. HIT-3లోనూ మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ క్లైమాక్స్‌లో కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News April 3, 2025
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.