News February 7, 2025

కుటుంబంతో రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన సచిన్

image

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.

Similar News

News March 13, 2026

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బెనిఫిట్ షోలు ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ప్రదర్శితమవుతాయి.

News March 13, 2026

నేనూ రైతు బిడ్డనే: చంద్రబాబు

image

AP: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ₹6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ₹14 వేలు కలిపి ఏటా ప్రతి రైతు ఖాతాలో ₹20 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూడా రైతు బిడ్డనేనని.. వారి కష్టాలు తనకు తెలుసని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

News March 13, 2026

మనిషి శరీరంలో గోల్డ్ ఉంటుందని తెలుసా?

image

మన శరీరంలోనూ బంగారం ఉంటుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. 70KGల బరువున్న మనిషి శరీరంలో దాదాపు 0.2mgల గోల్డ్ ఉంటుంది. చాలా తక్కువ పరిమాణంలో రక్తంలో కరిగి ఉంటుంది కాబట్టి దీనిని వేరు చేయడం సాధ్యపడదు. ఇది కీళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుందని, శరీరంలో విద్యుత్ సంకేతాలకు మద్దతు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో