News December 4, 2024
పేద పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టనున్న సచిన్ కూతురు

తన కుమార్తె సారా టెండూల్కర్ సచిన్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా నియమితులైనట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెలిపారు. ‘ఆమె లండన్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ & విద్య ద్వారా భారతదేశాన్ని మరింత శక్తిమంతం చేయడానికి ఆమె ప్రయత్నిస్తోంది’ అని ఆయన తెలిపారు. నిరుపేద పిల్లలతో ఆమె ఉన్న ఫొటోలను ఆయన పంచుకున్నారు.
Similar News
News November 17, 2025
అముర్ ఫాల్కన్.. రోజుకు వెయ్యి కి.మీల ప్రయాణం

ప్రపంచంలోనే అత్యంత దూరం(22000 KM) వలస వెళ్లే పక్షుల్లో అముర్ ఫాల్కన్ జాతిది అగ్రస్థానం. సైబీరియా/ఉత్తర చైనా నుంచి వింటర్లో IND(ఈశాన్య రాష్ట్రాలు) మీదుగా ఆఫ్రికాకు ప్రయాణిస్తాయి. తాజాగా మణిపుర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 పక్షులకు శాటిలైట్ ట్యాగ్ చేశారు. వీటిలోని ఓ మగ పక్షి రోజుకు 1000KM చొప్పున 3 రోజుల్లోనే 3100KM వెళ్లినట్లు IAS సుప్రియ వెల్లడించారు. వీటి జర్నీ అద్భుతమన్నారు.
News November 17, 2025
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, నిమ్మరసం చేర్చి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తగ్గుతుంది.
News November 17, 2025
జిన్నింగ్ మిల్లుల బంద్.. రైతుల ఆవేదన!

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.


