News September 27, 2024

సచిన్ రికార్డు విరాట్‌కు దక్కకపోవచ్చు: హాగ్

image

టెస్టు క్రికెట్‌లో సచిన్ అత్యధిక పరుగుల(15,921) రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ(8871) వల్ల కాకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘విరాట్ ఆ రికార్డును అందుకుంటారని అనుకోను. ఆయన లయ కోల్పోయారు. వచ్చే 10 మ్యాచుల్లో గాడిలో పడకపోతే ఇక ఆ రికార్డు రేసు నుంచి విరాట్‌ తప్పుకొన్నట్లే. ఇప్పటికే 12వేల పరుగులకు చేరుకున్న జో రూట్‌‌కు సచిన్‌ను దాటే ఛాన్స్ ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 27, 2024

సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి: CM

image

TG: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. 6 నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

News September 27, 2024

హైకోర్టుకు గజ్జల లక్ష్మి.. తీర్పు రిజర్వు

image

AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

News September 27, 2024

ప్రశాంత్ వర్మ చేతికి బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాలు?

image

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు రెండు మైలురాళ్లు. వాటి సీక్వెల్స్ ఆలోచన తనకుందని ఆయన పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా అవి తెరకెక్కుతాయని సమాచారం. ప్రశాంత్ మోక్షుతో తీస్తున్న సినిమా అవుట్‌పుట్‌ను బట్టి ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.